బీజేపీ చీఫ్ విప్ అనురాగ్ ఠాకూర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం సభలో చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం నుంచి సభకు విధిగా హాజరుకావాలని కోరుతూ ఎంపీలకు మూడు లైన్లతో కూడిన విప్‌ను జారీ చేశారు. కాగా, పార్టీ చీఫ్ విప్‌గా అనురాగ్ ఠాకూర్‌ను బుధవారం ఉదయం బీజేపీ నియమించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తమ ఎంపీలకూ విప్ జారీ చేయాలని బీజేపీ కోరింది.
మరోవైపు నరేంద్ర మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాల్లో విధిగా పాల్గొనాలని కోరుతూ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని అంశాలను వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment