మమతపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు | BJP leader calls Mamata Banerjee ‘eunuch' | Sakshi
Sakshi News home page

మమతపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Published Mon, May 1 2017 11:00 AM | Last Updated on Fri, Mar 29 2019 6:01 PM

మమతపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు - Sakshi

మమతపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

మిడ్నాపూర్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత ఒకరు సంచలన వ్యాఖ్య చేశారు. మమత ఓ నపుంసకురాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ధుమారం రేపుతున్నాయి. ఆదివారం పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన పార్టీ ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర ప్యానెల్‌ సభ్యుడు శ్యామపాద మండల్‌ మాట్లాడుతూ ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారని ఆరోపించారు.

అసలు ఆమె స్త్రీనా, పురుషుడా అనే విషయం తమకు అర్ధం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక హిజ్రా అని తాను చెప్పగలనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత పార్థ చట్టర్జీ మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలతో, పెద్ద పెద్ద తప్పులతో తమ పార్టీని బలంగా మార్చుకోవాలని బీజేపీ యోచిస్తోందంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement