రాహుల్‌లో పాలనా స్వభావ లోపం | Character Rahul error in the administration | Sakshi
Sakshi News home page

రాహుల్‌లో పాలనా స్వభావ లోపం

Published Sun, Jun 29 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాహుల్‌లో పాలనా స్వభావ లోపం - Sakshi

రాహుల్‌లో పాలనా స్వభావ లోపం

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ వ్యాఖ్య
 
పణజీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికే పలువురు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలెదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ నాయకత్వ లక్షణాలను పరోక్షంగా ప్రశ్నించారు. రాహుల్‌లో పాలనా స్వభావం లేదని శనివారం పణజీలో ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన కేవలం అన్యాయాలపై పోరాడేందుకే ఇష్టపడతారని...ఆయనలో పాలనా మనస్తత్వం లేదని చెప్పుకొచ్చారు. కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ ఎందుకు వెనక అడుగు వేస్తుంటారన్న ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా బదులిచ్చారు.

లోక్‌సభలో రాహుల్ కాంగ్రెస్‌పక్ష నాయకుడిగా ఎందుకు కాలేకపోయారన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్థానం అవసరం. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతను రాహుల్ గాంధీయే చేపట్టాలని నేను ముందుగానే సూచించా. రాహుల్ ఆ బాధ్యతను చేపట్టి ఉండాల్సింది’’ అని అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆ తర్వాత బెంగళూరులో దిగ్విజయ్ వివరణ ఇచ్చారు. రాహుల్ అన్యాయాలపై పోరాడుతుంటారని...అందుకే ఆయనలో అధికార దాహం లేదనే కోణంలో తాను మాట్లాడినట్లు చెప్పారు. అధికారం కోసం ఆయన వెంపర్లాడరన్నారు. పార్టీలో రాహుల్‌కు, ఇతర నేతలకు ఉన్న తేడా అదేనని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement