సాక్షి, బెంగళూరు: సైన్స్ పరిశోధనలపై కామన్‌వెల్త్ దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు ‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ మంగళవారం ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్‌సీ) ప్రాంగణంలోని జె.ఎన్.టాటా ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సైన్స్ కాన్ఫరెన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించారు.
30కిపైగా కామన్‌వెల్త్ దేశాలకు చెందిన దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు కాన్ఫరెన్స్‌కి హాజరు కానున్నారని తెలిపారు. కామన్‌వెల్త్ దేశాల మధ్య వైజ్ఞానిక అంశాలు, పరిశోధనల సమాచార వినిమయానికి, సైన్స్ పరిశోధనలో వెనుకంజలో ఉన్న దేశాలకు చేయూతనందించేందుకు సదస్సు దోహదపడుతుందని వివరించారు. భారత ప్రభుత్వం, యూకేకు చెందిన ది రాయల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు.
నేటి నుంచి కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్
Published Tue, Nov 25 2014 6:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement