అమిత్ షా సభపై భగ్గుమన్న కాంగ్రెస్
పనాజి(గోవా): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోసం గోవా విమానాశ్రయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చట్ట వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేసినందుకు జరిమానా విధించాలని ఏఐసీసీ కార్యదర్శి గిరీష్ చోదన్కర్ డిమాండ్ చేశారు. అమిత్ షా వస్తుండంతో భారతీయ జనతా పార్టీ గోవా డబోలిం ఎయిర్‌పోర్ట్‌లో బహిరంగ సభ నిర్వహింది.
ఆయన రాకకు ముందు విమానాశ్రయం టెర్మినల్ వద్ద కొన్ని చైర్లను, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్, ఇతర బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.