'ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఉండదు'
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఉండదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించడమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని జైట్లీ అభిప్రాయపడ్డారు.
2014 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు అంకెలకే పరిమితమవుతుందని జైట్లీ జోస్యం చెప్పారు. తక్కువ సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో పెద్దగా పాత్ర ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని.. గౌరవంగా ప్రతిపక్ష పాత్రను స్వీకరించడమే ఆపార్టీ ముందున్న ఏకైక మార్గమన్నారు.
నాయకత్వలోపం, అవినీతి, దిగజారిన ఆర్ధిక వ్యవస్థలాంటి అంశాలు కాంగ్రెస్ ఓటమి ప్రధాన కారణాలన్నారు.