ప్లాన్‌ అదిరింది కానీ, బెడిసి కొట్టింది! | Corona Lockdown UP Men Hide In Milk Tank To Travel Home Town | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!

Published Thu, Mar 26 2020 4:40 PM | Last Updated on Thu, Mar 26 2020 4:53 PM

Corona Lockdown UP Men Hide In Milk Tank To Travel Home Town - Sakshi

పాల ట్యాంకు నుంచి బయటకు వస్తున్న వ్యక్తులు

లక్నో : కరోనా వైరస్‌ వ్యాప్తిని అదుపుచేసేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్వగ్రామాలను విడిచి వేరే చోట పనిచేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేరేచోట ఉండలేక సొంత గ్రామాలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సొంత ఊరికి చేరుకోవాలనే ఆశతో కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అడ్డంగా దొరికిపోయి పోలీసుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌ బిజ్‌నోర్‌ జిల్లాకు చెందిన 16మంది డెహ్రాడూన్‌లో పనిచేస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడే ఇరుక్కుపోయారు. ఎలాగైనా ఊరికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న వారు ఓ ఉపాయం ఆలోచించారు. ( ఆ విషయం మైకేల్‌ జాక్సన్‌ ముందే చెప్పారు )

పాల ట్యాంకును పోలీసులు అడ్డగించరనే ఉద్దేశ్యంతో ఖాళీగా ఉన్న దాంట్లో దాక్కున్నారు. కానీ, పాల ట్యాంకు బిజ్‌నోర్‌ జిల్లాలోని నాజిబాబాద్‌లోకి రాగానే పోలీసులు దాన్ని అడ్డగించి చెక్‌ చేశారు. దీంతో ఆ 16 మంది బయటకు రాక తప్పలేదు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసే విధంగా నడుచుకున్నందుకు గానూ పోలీసులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ( కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement