న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కరోనాపై ఆందోళన చెందవద్దని, అప్రమత్తతే దానికి సరైన విరుగుడు అని ట్వీట్ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకుకుని కరోనానను తరిమేద్దామని ఆయన ట్విటర్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆయన దేశవాసులకు పలు కీలక సూచనలు చేశారు.
(కరోనా : విమాన, హోటల్ చార్జీలు ఢమాల్)
కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఒకేచోట అందరూ గుమికూడవద్దని ప్రధాని సూచించారు. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గిద్దామని అన్నారు. కొన్నిరోజులపాటు మంత్రులెవరూ విదేశాల్లో పర్యటించబోరని ఆయన తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చర్యల్లో భాగంగానే పర్యాటక వీసాలు రద్దు చేశామని ఆయన స్పష్టం చేశారు. కాగా, గురువారం సాయంత్రం నాటికి దేశ వ్యాప్తంగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 1,26,273 ఉండటం ఆందోళనకరం.
(తీవ్ర భయాల నేపథ్యంలో ట్విటర్ కీలక నిర్ణయం!)
Say No to Panic, Say Yes to Precautions.
— Narendra Modi (@narendramodi) March 12, 2020
No Minister of the Central Government will travel abroad in the upcoming days. I urge our countrymen to also avoid non-essential travel.
We can break the chain of spread and ensure safety of all by avoiding large gatherings.
Comments
Please login to add a commentAdd a comment