గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వడోదర: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్లతో అది అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది. కేరళ రూ.90 వేల కోట్ల ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లతో దేశంలోనే ముందంజలో ఉండగా ధర్మాజ్ గ్రామం ఏకంగా రూ.వెయ్యి కోట్ల డిపాజిట్లతో వార్తల్లోకి ఎక్కింది.
ఈ విషయాన్ని వడోదర డివిజన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. హిర్వే మీడియాకు వెల్లడించారు. ధర్మాజ్‌లో 3 వేల కుటుంబాలు ఉండగా ఆయా కుటుంబాల నుంచి కొందరు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. వారు తమ డిపాజిట్లను స్వగ్రామంలో బ్యాంకుల్లో చేయడంతో ధర్మాజ్ ఆర్థికంగా అందరినీ ఆకట్టుకునేలా మారింది.