
10వేల అడుగుల ఎత్తు నుంచి ధోనీ పారాచూట్ జంప్
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ శిక్షణలో భాగంగా బుధవారం ప్యారాచూట్ జంప్ చేశాడు. ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం ధోనీ ఏఎన్ 32 ఆర్మీ విమానం నుంచి పదివేల అడుగుల ఎత్తులో తొలి పారాచూట్ జంప్ చేశాడు. అతడు మరో నాలుగు పారాచూట్ జంప్స్ చేయాల్సి ఉంది. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు.