పళ్లిపట్టు : 2016లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని దిండుగల్ లియోని పేర్కొన్నారు. డీఎంకే నేత విభాగం ఆధ్వర్యంలో పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేటలో డీఎంకే అధినేత కరుణానిధి 92వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నేత విభాగ ఉపాధ్యక్షుడు నాగలింగం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి గుమ్మిడిపూండి వేణు, మాజీ మంత్రి సుందరం తదితరులు పాల్గొని మొక్కలు నాటి జూన్ 3న జన్మించిన వారికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సహాయకాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దిండుగల్ లియోని ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం, కార్యదర్శి సచ్చితానందనం,అన్బళగన్, శివశక్తివేల్, అన్నామలై పాల్గొన్నారు.
2016లో స్టాలినే ముఖ్యమంత్రి!
Published Tue, Jul 7 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM
Advertisement
Advertisement