మద్యంతాగి డ్రైవింగ్ చేసిన వారికి ఇక మీదట మరింత కఠిన శిక్ష తప్పకపోవచ్చు.
న్యూఢిల్లీ: మద్యంతాగి డ్రైవింగ్ చేసిన వారికి ఇక మీదట మరింత కఠిన శిక్ష తప్పకపోవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి భారీ జరిమానా విధించే అవకాశముంది. తొలిసారి పట్టుబడిన వారికి ప్రస్తుత జరిమానా కంటే ఐదు రెట్లు అధికంగా అంటే 10 వేల రూపాయలు వేయవచ్చు.
కేంద్ర రవాణ శాఖ రూపొందించిన రోడ్డు రవాణ, భద్రత బిల్లులో ఈ మేరకు కఠిన నిబంధనలను చేర్చారు. ఈ బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా పరిశీలన కోసం అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చగా శిక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవారికి 2 వేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. తాజా బిల్లులో జరిమానాను పది వేల రూపాయలకు పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మరోసారి పట్టుబడిన వారికి అత్యధికంగా జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించనున్నారు.