దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ : దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. 16 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నియామవళి ఈరోజు నుంచే అమల్లోకి రానుంది.
(అయిదు రాష్ట్రాల సమగ్ర సమాచారం..► పాంచ్ పటాకా)
యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా... గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల పోలింగ్ సమయానికి ప్రధాని మోదీ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు నిండుతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోదీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది.
- పంజాబ్ : 117 స్థానాలు
- ఉత్తరాఖండ్ : 70 స్థానాలు
- మణిపూర్ : 60 స్థానాలు
-
గోవా : 40 స్థానాలు
- అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల వినియోగం
- ఐదు రాష్ట్రాల్లో 16 కోట్ల మంది ఓటర్లు
- లక్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు
- గతంలో కంటే 15 శాతం పోలింగ్ బూత్‌ల పెంపు
- వికలాంగులకు పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక సదుపాయాలు
-
నేటి నుంచే అమల్లోకి ఎలక్షన్ కోడ్
- యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.28 లక్షలు
- మణిపూర్, గోవాలో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.20 లక్షలు
- బ్యాలెట్ పత్రాలపై ఈసారి అభ్యర్థి ఫోటో తప్పనిసరి
- ఆర్మీ ఉద్యోగులు ఆన్ లైన్‌లో ఓటువేసే సదుపాయం
-
ఈసారి అందుబాటులోకి ఫోటో ఓటరు జాబితా
యూపీలో ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో దశలవారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎన్నికల కమిషన్ ఏడుదశల్లో ఎన్నికలు నిర్వహించనుంది.
ఎన్నికల తేదీలు
తొలి దశ : ఫిబ్రవరి 11
రెండో దశ: ఫిబ్రవరి 15
మూడో దశ: ఫిబ్రవరి 19
నాలుగో దశ : ఫిబ్రవరి 23
ఐదో దశ : ఫిబ్రవరి 27
ఆరో దశ : మార్చి 4
ఏడు దశ : మార్చి 8
పంజాబ్ : ఫిబ్రవరి 4 (ఒకే దశలో ఎన్నికలు)
117 నియోజకవర్గాల్లోని దాదాపు కోటీ 96 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల ద్వారా కీలకమైన తీర్పు ఇవ్వనున్నారు.
ఉత్తరాఖండ్ : ఫిబ్రవరి 4 (ఒకే దశలో ఎన్నికలు)
70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో నాలుగో అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2000లో ఏర్పాటైన ఉత్తరాఖండ్‌లో 2002, 2007, 2012లో ఎన్నికలు జరిగాయి.
మణిపూర్ : మార్చి 4, 8 (రెండు దశల్లో ఎన్నికలు)
60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
గోవా : ఫిబ్రవరి 4 (ఒకేదశలో ఎన్నికలు)
40 స్థానాలు ఉన్న గోవా జనాభా రీత్యా చిన్నదే అయినా పరిశ్రమలు, టూరిజం, భౌగోళిక స్థితిగతులు, చరిత్ర కారణంగా ఈ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది.