
న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఆరు లక్షల కంపెనీలూ, ఐదు కోట్ల మంది చందాదారులకూ మేలు చేకూర్చే లక్ష్యంతో మార్చిలో చెల్లించాల్సిన పీఎఫ్ వాటాలను మే 15దాకా వసూలు చేయరాదని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. మార్చి ప్రావిడెంట్ ఫండ్ వాటాను ఏప్రిల్ 15 లోపు చెల్లించాల్సి ఉండగా, దాని గడువుని మే 15కి పొడిగించినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించింది. మార్చి నెలలో జీతాలు చెల్లించిన కంపెనీలు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) ఫైల్ చేయడానికి గడువుని మే 15 వరకు పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.
కాగా, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుంచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో చందాదారులు గత పది రోజుల్లో భారీగా పీఎఫ్ మొత్తాలను విత్‌డ్రా చేసుకున్నారు. గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ. 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది.
ఇది చదవండి: ఈపీఎఫ్‌ను భారీగా లాగేశారు..
Comments
Please login to add a commentAdd a comment