చెన్నై: తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇదింతకరైలో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకి ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సమీప గ్రామంలోనే ఈ ఘటన జరిగింది. ఈ పేలుడుకు సంబంధించి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళనకారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పి ఉదయ కుమార్ చెప్పారు.