చెన్నై నుంచి విమాన సర్వీసులకు అనుమతి | flights will be operated by Air India and some private airlines from the Rajali Naval air station in Arakkonam | Sakshi
Sakshi News home page

చెన్నై నుంచి విమాన సర్వీసులకు అనుమతి

Published Fri, Dec 4 2015 4:56 PM | Last Updated on Tue, Oct 2 2018 7:43 PM

చెన్నై నుంచి విమాన సర్వీసులకు అనుమతి - Sakshi

చెన్నై నుంచి విమాన సర్వీసులకు అనుమతి

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయ అధికారులు కొన్ని విమానాలను నడిపేందుకు నిర్ణయించుకున్నారు. భారీ వర్షాల కారణంగా రద్దయిన విమాన సర్వీసులు నేడు పునరుద్ధరించనున్నట్లు  విమానాశ్రయ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎయిర్ ఇండియా నుంచి 7 విమానాల సేవలను ప్రారంభిస్తామని, వీలును బట్టి ఇతర ప్రైవేట్ విమానాలను కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

చెన్నై సమీపంలోని అరక్కోణంలోని రాజాలి నవల్ ఎయిర్ స్టేషన్ నుంచి ఈ విమానాలు తమ సర్వీసులు కొనసాగిస్తాయి. ఇదిలాఉండగా, రైలు సర్వీసులను శనివారం వారకు తాత్కాలికంగా రద్దు చేసిన విషయం అందరికీ విదితమే. తమిళనాడులో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే నీటితో నిండిపోవడంతో మంగళవారం నాడు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా  మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement