
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సోమవారం ఉదయం తన కార్యాలయంలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా.. కొత్త జడ్జీల ప్రమాణస్వీకారంతో ఆ సంఖ్య 34కు చేరింది.
దీంతో తొలిసారి సుప్రీంకోర్టుకి అత్యధికంగా 34 మంది న్యాయమూర్తులుగా నియామకమయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు న్యాయమూర్తులు వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి, జస్టిస్ హృషికేశ్‌రాయ్ కేరళ హైకోర్టుకి, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టులకి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ రాజస్తాన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌లుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment