న్యూఢిల్లీ: వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్, ఫ్రాన్స్‌లు నిర్ణయించాయి. భారత రక్షణ మంత్రి, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేల మధ్య శుక్రవారం జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రాంతీయ భద్రత, రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడం తదితర విషయాలు ప్రస్తావనకొచ్చాయి.
ఉగ్ర వ్యతిరేక పోరాటంలో కూడా సహకారాన్ని విస్తరించుకోవాలని ఇరు వర్గాలు తీర్మానించాయి. ఈ విషయంలో సముద్ర తీర భద్రతపై ముఖ్యంగా చైనా ప్రాబల్యం పెరుగుతున్న హిందూ పసిఫిక్ ప్రాంతంపై దృష్టిపెట్టాలని అంగీకరించాయి. ఇరు దేశాల రక్షణ సంబంధాల బలోపేతానికి ఇది వరకే ప్రారంభించిన చర్యలను కూడా మంత్రులు సమీక్షించారు. సీతారాంతో తన చర్చలు అద్భుతంగా జరిగాయని పార్లే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment