'మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించండి'
న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మన్నా రామ్ ను కారు ఢీకొట్టిన ఘటనలో మరణించారు.
ప్రమాదవశాత్తు మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు కేజ్రీవాల్ సూచించారు.
దక్షిణ ఢిల్లీలో డ్యూటి నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మన్నారామ్ 'అనుమతి లేని ప్రదేశంలో ప్రవేశిస్తున్న కారును ఆపడానికి ప్రయత్నించగా.. వాహనదారుడు దురుసుగా కానిస్టేబుల్ పైకి ఎక్కించారు. ఈఘటనలో కానిస్టేబుల్ చనిపోయారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
ఆప్ ప్రభుత్వ హయంలో డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ ను వాటర్ మాఫియా హత్య చేసిన ఘటనలో మృతుడికి కోటి రూపాయలు చెల్పించిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కేజ్రీవాల్ దృష్టికి తీసుకువచ్చారు.