కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌కు పశ్చిమ ఆసియా ప్రాంత బాధ్యతలు అప్పగించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌కు పశ్చిమ ఆసియా ప్రాంత బాధ్యతలు అప్పగించారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ దేశాలతో ఎన్డీఏ ప్రభుత్వం సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని కోరుకుంటోంది. గల్ఫ్ ప్రాంతంలో సుమారు 50 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
ఇక్కడి రాజకీయాలపై అక్బర్‌కు పట్టుంది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మినహా యూరోపియన్ యూనియన్, సెంట్రల్, పశ్చిమ యూరప్ దేశాలతో భారత్ సంబంధాలనూ అక్బర్ పర్యవేక్షిస్తారు. పశ్చిమ ఆఫ్రికా, యూరేసియా(రష్యా మినహా) దేశాలతో భారత్ సంబంధాల బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. విదేశాంగ శాఖలో అక్బర్‌తో పాటు వీకేసింగ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.