ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణిపై సమీక్ష | Government to review creamy layer criteria for OBC by year-end | Sakshi
Sakshi News home page

ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణిపై సమీక్ష

Published Thu, Sep 1 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

Government to review creamy layer criteria for OBC by year-end

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణి (క్రిమిలేయర్) విధానాన్ని కేంద్రం సమీక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. ఓబీసీల్లో కుటుంబాదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించి ఉన్నవారిని ప్రస్తుతం సంపన్నవర్గంగా పరిగణిస్తున్నారు. వీరికి విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు.

ఈ ఏడాది చివరికల్లా నిర్వచనాన్ని మరోసారి సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement