చెన్నై: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 6 నెలల చిన్నారి జ్ఞానసాయి చికిత్సకు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో జ్ఞానసాయిని డాక్టర్ రేల పరీక్షించారు. ప్రస్తుతం పాప పరిస్థితి మామూలుగానే ఉందని అన్నారు. చిన్నారి తల్లిదండ్రుల కాలేయం పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్సకు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అయితే శస్త్ర చికిత్సకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని గ్లోబల్ హాస్పటల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కాలేయ సమస్య కారణంగా మెర్సీకిల్లింగ్కు అనుమతించాలని గతంలో జ్ఞానసాయి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
చిన్నారి జ్ఞానసాయి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు
Published Mon, Jun 27 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement