
ఆధునిక హంగుల్లో..
ముంబై: రూ.500, 1,000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త సిరీస్‌ల్లో రూ.500, రూ.2,000 నోట్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. కొత్త సైజుల్లో, ఆధునిక ఫీచర్లను జోడించి వీటిని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. అత్యధిక డినామినేషన్ అరుున రూ.2000 నోటును ‘మహాత్మాగాంధీ (న్యూ) సిరీస్’ పేరుతో తెస్తోంది. ఈ నోటు వెనుక అరుణ గ్రహంపై ఇస్రో చేసిన చౌకయాత్రను తలపించే ‘మిషన్ టు మార్స్’ అరుున మంగళయాన్‌ను ముద్రించినట్లు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మాజెంటా రంగులో ఉండే ఈ నోటు 66 మి.మీ.-166 మి.మీ. సైజులో ఉంటుందని పేర్కొంది. అలాగే రూ.500 నోటును వేరే రంగులో, వేరే సైజులో, వేరే థీమ్‌లో తెస్తున్నట్లు తెలిపింది. స్టోన్‌గ్రే రంగులో ఉండే ఈ నోటు 63 మి.మీ.-150 మి.మీ. సైజులో ఉంటుందని, దీనిపై ఢిల్లీలోని ఎరక్రోట చిత్రం ముద్రించి ఉంటుందని చెప్పింది. రూ.500, రూ.2000 నోట్ల కొత్త డిజైన్లు అంధులతోపాటు అందరూ సులువుగా గుర్తించేలా ఉంటాయని పేర్కొంది. కాగా, నోట్ల మార్పిడిలో ఏవైనా ఇబ్బందులున్నా, అనుమానాలున్నా నివృత్తి కోసం పౌరులు హెల్ప్‌లైన్ నంబర్లు 022-22602201 022-22602944కు ఫోన్‌చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది.