
కక్ష్యలోకి చేరిన జీశాట్–9
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన రాష్ట్రపతి ప్రణబ్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సార్క్ దేశాలకు ఉపయోగపడే జీశాట్–9 (దక్షిణాసియా ఉపగ్రహం)ను 3 విడతలుగా కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ సోమవారం రాత్రి భూమికి 36కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహంలోని లామ్ ఇం జిన్‌లో 1,255 కిలోల ఇంధనాన్ని ఈ నెల 6న 2,643 సెకన్ల పాటు మండించి మొదటి విడతగా కక్ష్య దూరా న్ని పెంచారు. 7న 3,529.7 సెకన్లతో పాటు మరో మారు ఇంధనాన్ని మండించి రెండో విడతగా కక్ష్య దూరాన్ని పెంచారు. మళ్లీ 8న 445.8 సెకన్ల పాటు ఇంధనాన్ని మండించి మూడోసారి కక్ష్య దూరాన్ని పెంచారు.
ఈ నెల 5న సాయంత్రం 4.57కు షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్– 09 రాకెట్ ద్వారా జీశాట్–9 ఉపగ్రహాన్ని 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శని, ఆది, సోమవారాల్లో బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను పూర్తి చేశారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్ ప్యానెల్స్ విచ్చుకుని బాగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ ఉపగ్రహం సార్క్‌దేశాల్లో సభ్య దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్,భూటాన్, శ్రీలంక, అఫ్గా నిస్థాన్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందిస్తోం ది. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రత్యేక లేఖను పంపించారు.