హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే బెస్ట్!
హైదరాబాద్: హెచ్ సీయూ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వ విద్యాలయాలను పక్కకు నెట్టి.. బెస్ట్ విజిటర్స్ అవార్డుకు ఎన్నికైంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 4న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అందించనున్నారు.
ఈ అవార్డు ఎంపికకు ఉత్తమ యూనివర్సిటీ, పరిశోధన, ఆధునీకరణ తదితర అంశాలను పరిశీలిస్తారు. దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు రాష్ట్రపతే 'విజిటర్' కావడంతో ఆయన చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ అవార్డులకు సంబంధించి ఫిబ్రవరి 4, 5 వ తేదీల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఫేస్ బుక్ లో తెలిపింది. ఆన్ లైన్ లో అన్ని యూనివర్సిటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, వాటిలోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అలా హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ అవార్డుకు ఎంపికైంది.