కొల్లాం : కేరళలోని కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదం మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఇది హృదయ విదారకమైన ప్రమాదమని, మాటలకందని విషాదమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం గురించి కేరళ సీఎం ఓమన్ చాందీతో ఫోన్ లో మాట్లాడినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. తాను కూడా వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు.
అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విట్టర్ కొల్లాం ప్రమాదంపై స్పందించారు. ఇటువంటి విషాదవార్త విన్నందుకు బాధగా ఉందన్నారు. బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Fire at temple in Kollam is heart-rending & shocking beyond words. My thoughts are with families of the deceased & prayers with the injured.
— Narendra Modi (@narendramodi) 10 April 2016
Spoke to CM Oommen Chandy about the fire at a temple in Kollam. Arranging for immediate shifting of those critically injured via helicopter.
— Narendra Modi (@narendramodi) 10 April 2016
Have also asked my Cabinet colleague & Health Minister @JPNadda to immediately reach the site of the fire tragedy in Kollam.
— Narendra Modi (@narendramodi) 10 April 2016