
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ను ఆకస్మిక వర్షాలు ముంచెత్తాయి. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు రోడ్లు జలమయం అయ్యాయి. లాల్ చౌక్, రాజ్‌బాగ్, ఖన్యర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక, నగరంలోని బిమినా, మెహ్‌జూర్ నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
స్థానిక వాతావరణ శాఖ సమాచారం ప్రకారం శ్రీనగర్‌లో గురువారం ఉదయం 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉత్తర, సెంట్రల్ కశ్మీర్‌లో భారీగా వర్షాలు కురిశాయి. జమ్మూకశ్మీర్‌లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ సమాచారం అందించడంతో ఆదివారం వరకు అమర్‌నాథ్ యాత్రను నిలిపేశారు. అమర్‌నాథ్ యాత్ర మార్గంలోని పహల్‌గామ్, బల్టాల్ ప్రాంతాల్లో రానున్న 12 గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment