తప్పుచేసినట్టు రుజువైతే మరణశిక్షకు సిద్ధం | I am ready to face the death penalty if found guilty, says Madhya Pradesh high court judge | Sakshi
Sakshi News home page

తప్పుచేసినట్టు రుజువైతే మరణశిక్షకు సిద్ధం

Published Mon, Aug 4 2014 8:02 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

I am ready to face the death penalty if found guilty, says Madhya Pradesh high court judge

భోపాల్: మహిళా జడ్జిని తాను లైంగికంగా వేధించినట్టు రుజువైతే మరణశిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు.

గ్వాలియర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ తనను హైకోర్టులోని ఓ  జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ జడ్జి తనను   ఓ ఐటెం సాంగ్కు డాన్సు చేయమన్నారని కూడా ఆమె ఆరోపించారు. ఈ విషయాలు  చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు అనుమతి ఇవ్వలేదంటూ జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేశారు.

మధ్యప్రదేశ్లోని హైకోర్టు గ్వాలియర్ బెంచ్ జడ్జి వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలైంది. మహిళా జడ్జిని హైకోర్టు జడ్జి లైంగికంగా వేధించారని ఆ పిల్లో ఆరోపించారు. హైకోర్టు జడ్జిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలని పిటిషనర్ తన పిల్‌లో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement