ఐదేళ్లుగా ఘోరం.. | 12-year-old girl raped by father for 5 years, with help from mother | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా ఘోరం..

Published Mon, Jan 8 2018 8:34 PM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

12-year-old girl raped by father for 5 years, with help from mother - Sakshi

సాక్షి, చత్తర్పూర్‌ : మధ్యప్రదేశ్‌లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై తల్లి ప్రోత్సాహంతో ఐదేళ్లుగా తండ్రి సాగిస్తున్న లైంగిక దాడి ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని చత్తార్పూర్‌లో బాధితురాలి కుటుంబం నివసిస్తోంది. గత ఐదేళ్లుగా మైనర్‌ బాలికపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తండ్రి సాగిస్తున్న దారుణాన్ని తల్లి అడ్డుకోకపోగా సహకరిస్తోంది.

గత ఏడాది ఇంట్లో జరుగుతున్న ఘోరాన్ని తెలుసుకున్న బాధితురాలి సోదరుడు ప్రతిఘటించినా తండ్రి బెదిరించడంతో మిన్నకుండిపోయాడు. తండ్రి అఘాయిత్యాన్ని భరించలేని బాధితురాలు ఇంటి నుంచి పారిపోయి తమ బంధువులకు జరిగిందంతా వివరించింది. వారు బాలికను వెంటబెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. తల్లితండ్రులిద్దరినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై నీచానికి ఒడిగట్టిన వారిద్దరికీ మరణ శిక్ష విధించాలని బాధిత బాలిక కోరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement