భోపాల్ : మృగాళ్లను వెంటనే ఉరి తీయాలి అని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని కట్ని కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందుతునికి కేవలం ఐదురోజుల్లోనే ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ కోల్ అనే ఆటో డ్రైవర్ స్కూల్‌కు వెళ్లడం కోసం తన ఆటో ఎక్కే ఓ ఐదేళ్ల చిన్నారిపై ఈ నెల 4న అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు జులై 7 న రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ నెల 12 న అతడిపై చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ నెల 23న విచారణ ప్రారంభమయ్యింది. నేర చట్ట (సవరణ) 2018లో ప్రవేశపెట్టిన సెక్షన్ 376(ఏ)(బీ), బాలల పట్ల లైంగిక నేరాల నిరోధింపు చట్టం కింద ఉన్న సంబంధిత సెక్షన్‌ల ప్రకారం నిందుతుడు రాజ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించారు. విచారణ ప్రారంభమైన 5 రోజుల్లోనే అనగా నేడు (జులై 28) ప్రత్యేక అదనపు కోర్టు జడ్జి మధురి రాజ్ లాల్ ఈ తీర్పును వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment