'బిహార్లో బీజేపీ ఓడితే.. పాక్లో క్రాకర్స్' | If BJP Loses Bihar Elections, Crackers Will Go Off in Pakistan: Amit Shah | Sakshi
Sakshi News home page

'బిహార్లో బీజేపీ ఓడితే.. పాక్లో క్రాకర్స్'

Published Thu, Oct 29 2015 7:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'బిహార్లో బీజేపీ ఓడితే.. పాక్లో క్రాకర్స్' - Sakshi

'బిహార్లో బీజేపీ ఓడితే.. పాక్లో క్రాకర్స్'

బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం బిహార్లోని రక్సల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 'ఈ దేశంలో గెలుపు ఓటములు జరుగుతూనే ఉంటాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ఓటమి పాలైతే.. పాకిస్థాన్లో క్రాకర్స్ కాల్చుతారు. అలా జరగాలని మీరు కోరుకుంటున్నారా?' అని అన్నారు. దీనికి జవాబుగా ర్యాలీకి హాజరైన ప్రజలు 'లేదూ.. లేదూ' అని బదులిచ్చారు.


బీజేపీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా మోదీ నాయకత్వంలో అభివృద్ధిని ప్రచారాస్త్రంగా వాడుతుంది. బుధవారం జరిగిన మూడోదశ పోలింగ్తో సగానికి పైగా స్థానాలలో పోలింగ్ పూర్తయింది. బీజేపీకి మహా కూటమితో గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రెండు దశల పోలింగ్ పూర్తయ్యాక నవంబర్ 8న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement