వార్షిక వేతనం రూ.32 లక్షలు! | IIM-Indore graduate gets Rs 32 lakh annual salary offer | Sakshi
Sakshi News home page

వార్షిక వేతనం రూ.32 లక్షలు!

Published Mon, Mar 31 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

వార్షిక వేతనం రూ.32 లక్షలు!

వార్షిక వేతనం రూ.32 లక్షలు!

 ఐఐఎం-ఇండోర్ గ్రాడ్యుయేట్‌కు దక్కిన అదృష్టం
 ఇండోర్: సంవత్సరానికి ముప్పై రెండు లక్షల రూపాయలు... ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)-ఇండోర్‌కు చెందిన విద్యార్థికి ఓ భారతీయ కంపెనీ ఆఫర్ చేసిన వార్షిక వేతనమిదీ. అయితే ఇది గతేడాది ఇదే సంస్థకు చెందిన విద్యార్థికి ఆఫర్ చేసిన మొత్తం కంటే రూ.రెండు లక్షలు తక్కువ కావడం గమనార్హం.
 
  ఐఐఎం-ఇండోర్‌లో నిర్వహించిన ప్లేస్‌మెంట్ కార్యక్రమంలో 2012-14 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.32 లక్షల వార్షిక వేతనాన్ని భారతీయ కంపెనీ ఒకటి ఆఫర్ చేసినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. సదరు కంపెనీ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 2012-14 బ్యాచ్‌కు చెందిన మొత్తం 475 మందికి కూడా తాజా ప్లేస్‌మెంట్ ప్రోగ్రాంలో ఉద్యోగాలు లభించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి దక్కిన సగటు వార్షిక ప్యాకేజీ రూ.12.13 లక్షలని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement