న్యూఢిల్లీ: రానున్న పదేళ్లు భారత్‌కు దృఢమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు మంచివి కావని, జాతీయ, రాజకీయ, ఆర్థిక పరమైన లక్ష్యాలను సాధించడానికి దృఢమైన ప్రభుత్వమే కావాలని ఆయన పేర్కొన్నారు. గురువారం సర్దార్ పటేల్ మెమోరియల్ ‘డ్రీమ్ ఇండియా 2030– అవాయ్‌డింగ్ ద పిట్‌ఫాల్స్’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బలహీనమైన ప్రజాస్వామ్యాలు దేశాన్ని మరింత బలహీనంగా మార్చగలవు.
రానున్న కొన్నేళ్లలో భారత్ అలాంటి వాటికి తలొగ్గకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నప్పుడు రాజీపడాల్సి వస్తుందని, ఎప్పుడైతే రాజీ పడతామో అప్పుడు జాతీయత కన్నా రాజకీయ మనుగడకే ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించారు. విచ్ఛిన్న రాజకీయాలు, బలహీనమైన ప్రభుత్వాలు భారత్ లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడతాయన్నారు. ఇందుకు దోవల్ తన ప్రసంగంలో బ్రెజిల్‌ను ఉదహరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందున్న బ్రెజిల్.. రాజకీయ అస్థిరత కారణంగా వృద్ధిలో వెనుకబడి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment