నీ జన్‌ధన్ ఖాతాలో రూ. 10 లక్షలకు లెక్క చెప్పాలంటూ రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిచ్చింది.
అహ్మదాబాద్: నీ జన్‌ధన్ ఖాతాలో రూ. 10 లక్షలకు లెక్క చెప్పాలంటూ రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిచ్చింది. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని మన్షుక్ మక్వాన(55)కు ఈ నోటీసులొచ్చాయి. జన్‌ధన్ ఖాతాలో అంత మొత్తం ఎలా వచ్చిందో చెప్పాలని నోటీసుల్లో ఐటీ శాఖ పేర్కొంది.
నా జీవితంలో ఎప్పుడూ అంత డబ్బు చూడలేదని, రోజంతా కష్టపడితే రూ. 200 లు వస్తాయని, అలాంటప్పుడు అంత మొత్తం ఎలా డిపాజిట్ చేస్తానని మన్షుక్ ఆవేదన వ్యక్తం చేశాడు.