కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం | J&K: One terrorist killed in encounter in Kupwara; combing operation continues | Sakshi
Sakshi News home page

కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం

Nov 23 2015 12:43 PM | Updated on Sep 3 2017 12:54 PM

జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుప్వారా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ కారణంగా ఓ లెఫ్టినెంట్ కల్నల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

అక్కడి చుట్టుపక్కల అడవిలో తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉగ్రవాదులు ఎదురవ్వగా.. ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సమయంలో వారు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఓ ఉగ్రవాది పోలీసుల కాల్పులకు హతమయ్యాడు. హంద్వారాలోని భవన్ అనే గ్రామంలో ఉగ్రవాదుల అలికిడి ఉందని గత శనివారం సమాచారం అందినప్పటి నుంచి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement