నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన | Judge who ordered FIR against Kerala CM Chandy seeks voluntary retirement | Sakshi
Sakshi News home page

నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన

Published Fri, Jan 29 2016 5:41 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన - Sakshi

నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన

తిరువనంతపురం:
సోలార్ స్కాంపై కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆవేదన చెందిన విజిలెన్స్ కోర్టు జడ్జి జస్టిస్ వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) వైపు మొగ్గు చూపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించిన కొన్ని గంటల్లోనే వాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది.  

విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కలత చెందడం వల్లే జడ్జి వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ అంటున్నారని తెలుస్తోంది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement