ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం | Kamal Nath is protem Speaker sworn in | Sakshi
Sakshi News home page

ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం

Published Thu, Jun 5 2014 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం - Sakshi

ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని ఎల్లో డ్రారుుంగ్ రూమ్‌లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో కమల్‌నాథ్‌తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేరుుంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఇతర అతిథులంతా ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. కమల్‌నాథ్ తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచారు. 67 ఏళ్ల కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభలో తమ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని, దేశంతో పాటు యువత ఆశలు నెరవేరేలా పనిచేస్తామని ఆయన విలేకరులకు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement