![కేంద్రానికి కరుణానిధి లేఖ](/styles/webp/s3/article_images/2017/09/2/71375707706_625x300_4.jpg.webp?itok=EBxosrFu)
కేంద్రానికి కరుణానిధి లేఖ
చెన్నై: తమిళనాడులో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు లేఖలు రాశారు.
తమిళనాడులో రాజ్యంగయంత్రాగం పూర్తిగా విఫలమైందని కరుణానిధి ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షపడిన నేపథ్యంలో శనివారం అన్నా డీఎంకే కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కరుణానిధి కేంద్రానికి లేఖలు రాశారు.