
కరుణానిధి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు జైలుశిక్ష విధించిన 12 రోజుల తర్వాత డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు.
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు జైలుశిక్ష విధించిన 12 రోజుల తర్వాత డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. బెంగళూరులోని సిబిఐ కోర్టు గత నెల 27న జయలలితకు నాలుగు ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జయ తనకుతానే వలలో చిక్కుకున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆమె కల ఎప్పటికీ నెరవేరదన్నారు.
అమ్మ ఫొటోలు తొలగించకుంటే కోర్టుకెళతాం : డిఎంకె
తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అమ్మ పథకాలపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలను వెంటనే తొలగించాలని కోరుతూ డిఎంకె పార్టీ అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తరం రాసింది. 24 గంటల్లోగా అమ్మ ఫొటోలు తొలగించకపోతే కోర్టుకెళ్లాల్సి ఉంటుందని ఆ లేఖ ద్వారా అల్టిమేటం జారీచేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేరం రుజువై శిక్ష అమలు కావడంతో తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ సభ్యత్వాన్ని, ముఖ్యమంత్రి పదవిని జయ కోల్పోయారు.
జయ అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయిపోయినందున శ్రీరంగం అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించాలని డీఎంకే కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఉన్న జయలలిత ఫొటోలను తొలగించాలని డిమాండ్ చేసింది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, అమ్మ ఫార్మసీ తదితర పథకాలపై ఉన్న జయ ఫొటోలను సైతం వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా, సీఎం పదవి నుంచి జయలలిత తొలగింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.
**