ఫుల్లుగా తాగి.. విమానాలు నడుపుతారట!
ఫుల్లుగా తాగి.. విమానాలు నడుపుతారట!
Published Wed, Oct 26 2016 5:17 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
ఫుల్లుగా తాగేసి.. విదేశాల నుంచి రావాల్సిన విమానాలు నడిపేందుకు వచ్చిన ఇద్దరు పైలట్లపై ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు వేటు వేశాయి. ప్యారిస్ నుంచి ముంబై రావాల్సిన జెట్ ఎయిర్‌వేస్ పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేయగా, ఎయిరిండియా పైలట్ రెండోసారి తాగి పట్టుబడటంతో మూడేళ్ల పాటు అతడి లైసెన్సును సస్పెండ్ చేశారు. ఆ పైలట్ బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. ఇద్దరినీ గ్రౌండ్ చేశారని, వాళ్లిద్దరి లైసెన్సులను డీజీసీఏ సస్పెండ్ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో పైలట్లు తొలిసారి తాగి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి పట్టుబడితే మూడేళ్లు లైసెన్సు సస్పెండ్ చేస్తారు. అదే మూడోసారి కూడా పట్టుబడితే వాళ్ల లైసెన్సును శాశ్వతంగా రద్దుచేస్తారు. ఇతర దేశాలకు చెందిన పైలట్లకు అప్పుడప్పుడు ఈ పరీక్షలు చేస్తారు గానీ, డీజీసీఏ నిబంధనల ప్రకారం భారతీయ పైలట్లను మాత్రం ప్రతిసారీ తప్పనిసరిగా పరీక్షిస్తారు. ఇలా తాగి పట్టుబడిన పైలట్లలో ఎక్కువమంది జెట్ ఎయిర్‌వేస్ వాళ్లే ఉన్నారు. 2013 నుంఇచ 2015 వరకు దాని అనుబంధ సంస్థ జెట్‌లైట్‌తో కలిపి 38 మంది పైలట్లు తాగి పట్టుబడ్డారు.
Advertisement