తాగి విమానాలు నడుపుతున్నారు! | two pilots found alcohol positive, suspended for four years | Sakshi
Sakshi News home page

తాగి విమానాలు నడుపుతున్నారు!

Published Fri, Aug 12 2016 11:19 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

తాగి విమానాలు నడుపుతున్నారు! - Sakshi

తాగి విమానాలు నడుపుతున్నారు!

ఎయిరిండియా, జెట్  ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు పైలట్లు తాగి విమానాలు నడిపినందుకు వాళ్లను డీజీసీఏ నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేసింది. విమానం ల్యాండయిన తర్వాత వారికి చేసే పరీక్షలలో వారు వదిలిన గాలిలో ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎయిరిండియా కేబిన్ క్రూ సిబ్బందిలో ఒకరిని కూడా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రెండు ఎయిర్‌లైన్స్ సంస్థలను కూడా ఆయా పైలట్లపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయాల్సిందిగా డీజీసీఏ సూచించింది. ఈ రెండూ విదేశాల నుంచి వచ్చిన విమానాలేనని తెలుస్తోంది.

ఈనెల పదో తేదీన షార్జా నుంచి కాలికట్ వచ్చిన ఎయిరిండియా విమానంలో పైలట్కు విమానం దిగిన తర్వాత పరీక్షలు చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ అని వచ్చింది. అలాగే ఈనెల 3న అబుదాబి నుంచి చెన్నై వచ్చిన జెట్ ఎయిర్‌వేస్ విమాన పైలట్ కూడా తాగినట్లు తేలింది. ఎయిరిండియా పైలట్‌ను గ్రౌండింగ్ చేయగానే విమానం నడిపేందుకు తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బంది తలెత్తింది. తర్వాత కోజికోడ్ నుంచి వేరే విమానంలో అదనపు పైలట్‌ను పంపి, ఆయనతో విమానాన్ని మళ్లీ నడిపించారు. ఇక జెట్ ఎయిర్‌వేస్ విమానాన్ని తాగి నడిపిన పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement