సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నాలుగైదు గంటలు ఆలస్యంగా లేదా మరుసటి రోజు వెలువడవచ్చని ఈసీ అధికారి వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేసిన ఐదు ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలన్న సుప్రీం ఉత్తర్వులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు చేపట్టే మే 23న కాకుండా మే 24నే తుదిఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అంతకుముందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఈవీఎంలో పోలయిన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించే వారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment