లక్నో: పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై కాల్పుల ఘటనలతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యువకుడు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు సదరు యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.(ఎన్నార్సీ అమలుపై కేంద్రం కీలక ప్రకటన!)
పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని క్లాక్ టవర్ వద్ద పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా నిరసన చేసేవారిని తుపాకితో కాలుస్తానని బెదిరిస్తూ శ్రావణ శర్మ అనే యువకుడు జనవరి 30న తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి లక్నోలో శ్రావణశర్మను అరెస్ట్ చేశారు. ఉన్నావ్ జిల్లాకు చెందిన అతను సివిల్ ఇంజనీరింగ్ చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. శ్రావణశర్మను తన స్నేహితుని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అదే విధంగా శ్రావణశర్మకు రాడికల్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(సీఏఏకు వ్యతిరేకంగా సియాటెల్ నగర కౌన్సిల్ తీర్మానం)
Comments
Please login to add a commentAdd a comment