ముంబై: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ గతంలో కొంతమంది కళాకారులు, రచయితలు తమ అవార్డులను వాపస్ ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలో మహారాష్ట్ర రైతులు నడుస్తున్నారు. అయితే రైతులు మాత్రం కరువు పీడిత ప్రాంతాల్లో తమను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వానికి నిరసనగా ఈ అవార్డ్ వాపసీ ఉద్యమానికి పూనుకున్నారు.
సాగులో చూపించిన ప్రతిభకు గాను 1983లో రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న జల్నా ప్రాంతానికి చెందిన నారాయన్ ఖడ్కే(78) అనే రైతు ఇటీవల తన అవార్డును తిరిగిచ్చాడు. లాతుర్ జిల్లాలోని కర్ల గ్రామానికి చెందిన మరోరైతు విఠల్రావ్ కాలే కూడా అవార్డుతో పాటు తనకు లభించిన 10 వేల నగదును సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అమలులో మాత్ర చిత్తశుద్ధిని చూపించడం లేదని ఖడ్కే వెల్లడించారు.
అవార్డ్లు వాపస్ ఇస్తున్న రైతులు!
Published Sun, Feb 21 2016 4:15 PM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
Advertisement