మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ | malaysian PM Najib Razak meets with PM Narendra Modi in Delhi | Sakshi
Sakshi News home page

మలేసియా ప్రధానితో మోదీ భేటీ

Published Sun, Apr 2 2017 2:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ - Sakshi

మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ

భారత్, మలేసియాల మధ్య కుదిరిన 7 ఒప్పందాలు

న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదం లాంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, మలేసియాలు అంగీకరించాయి. ప్రధాని మోదీ, భారత్‌లో పర్యటిస్తున్న మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ల మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో  ద్వైపాక్షికసంబంధాలు ప్రస్తావనకొచ్చాయి. రెండు దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

వీటిలో విమాన సేవలు, ఇరు దేశాల విద్యార్హతలకు పరస్పర గుర్తింపు ఇవ్వడం, క్రీడల్లో సహకారం, అహ్మదాబాద్‌లోని ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా మలేషియాలో శిక్షణ కార్యక్రమాలు, మలేషియాలో 2.5 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న ఎరువుల కర్మాగారం ఏర్పాటు తదితరాలున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని, ఉగ్ర చర్యలను ఏ విధంగానూ సమర్థించలేమని ఇరువురు నేతలు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement