పాట్నా పేలుళ్లను ఖండించిన మన్మోహన్ సింగ్
ప్రధాని మన్మోహన్ సింగ్ బీహార్ రాజధాని పాట్నా వరస బాంబు పేలుళ్లను ఖండించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 'హూంకార్' ర్యాలీలో పాల్గొనే ముందు జరిగిన పేలుళ్లలో ఒకరు మరణించిన సంఘటనపై మన్మోమన్ స్పందించారు. ప్రజలందరూ శాంతిసామరస్యాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఫోన్ చేసి సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. పేలుళ్లపై సత్వరమే దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని ఆదేశించారు. పాట్నాలో మొత్తం ఆరు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగతా నాలుగు బాంబులు హూంకార్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం.