మిమ్మల్నెంతో మిస్సవుతాను | manmohan we miss you : barak obama | Sakshi
Sakshi News home page

మిమ్మల్నెంతో మిస్సవుతాను

Published Sun, May 18 2014 2:19 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

మిమ్మల్నెంతో మిస్సవుతాను - Sakshi

మిమ్మల్నెంతో మిస్సవుతాను

మన్మోహన్‌కు ఒబామా వీడ్కోలు ఫోన్ ఆయన గొప్ప నాయకుడని ప్రశంస

న్యూఢిల్లీ: ‘‘నేనెంతగానో ప్రశంసించే అతి కొద్దిమంది ప్రజా నేతల్లో మీరొకరు. మీతో కలిసి పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. దాన్ని గౌరవంగా భావిస్తున్నా. మీతో రోజువారీ ప్రాతిపదికన కలిసి పని చేయడాన్ని ఇకపై మిస్సవుతాను’’ - మన్మోహన్‌సింగ్‌తో అమెరికా అధ్యక్షుడు  ఒబామా చేసిన వ్యాఖ్యలివి. మన్మోహన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయనకు ఒబామా ఫోన్ చేసి సాదర వీడ్కోలు తెలిపారు.

ఒబామా కురిపించిన ప్రశంసలకు మన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. ఒబామా ఇంతకాలం పాటు తనకందించిన స్నేహాన్ని, మద్దతును మర్చిపోలేనన్నారు. పలు అంతర్జాతీయ సవాళ్లను అధిగమించేందుకు పరస్పర సహకారంతో కూడిన పనితీరును ప్రదర్శించడంలో ఒబామా ప్రదర్శించిన నాయకత్వ పటిమ ప్రశంసనీయమన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement