ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టిందని.. | Mayawati Cancels Ticket After Candidate's Feet-Touching Photos On Facebook | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టిందని..

Published Wed, Jan 13 2016 4:35 PM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టిందని.. - Sakshi

ఆ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టిందని..

ఫేస్బుక్ లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన అభ్యర్థి టికెట్ను బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసింది.

ఉత్తరప్రదేశ్: ఫేస్బుక్ లో తనకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన అభ్యర్థి టికెట్ను బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసింది. క్రమశిక్షణ పేరిట ఆమె ఈ చర్యలను తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అట్రౌలీ నియోజకవర్గంలో సంగీతా చౌదరీ అనే మహిళకు సీటు ఇచ్చి బరిలోకి దించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఎందుకంటే ఇదే స్థానం నుంచి గతంలో సంగీత భర్త ధర్మేంద్ర చౌదరీ పోటీ చేశాడు.

కానీ, అతడు గత ఏడాది జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆయన భార్య సంగీతతో భర్తీ చేయాలని మాయావతి భావించారు. ఈలోగా, తన కాళ్లను పట్టుకుంటూ సంగీత, ఆమె పిల్లలు దండం పెడుతున్న ఫొటోను ఫేస్ బుక్ లో సంగీత పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మాయావతిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సంగీతకు ఇక ఆ సీటు ఇవ్వకూడదని నిర్ణయించి రద్దు చేశారు. అయితే, తాను కావాలని ఆ ఫొటోను పెట్టలేదని, ఆమె తనతో ఉన్నట్లుగా కనిపిస్తే విజయం వరిస్తుందని చెప్పే ఉద్దేశంతోనే ఆ ఫొటో ఫేస్ బుక్ లో పెట్టానని సంగీత చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement