లక్నో : లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పని దొరక్కపోవడం, తినడానికి తిండి లేకపోవడంతో సోంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కార్మికులు తరలి వస్తుండడంతో కొన్ని రాష్ట్రాలు సరిహద్దుల వద్దే వీరిని నిలిపివేస్తున్నాయి. దీంతో పలు చోట్ల వలస కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. తమను తమ గ్రామాలకు వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు వదలకపోవడంతో అక్రమంగా రాష్ట్రాలలోకి ప్రవేశిస్తున్నారు. ( చదవండి : లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే)
ఉత్తర ప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దులోని ఛాక్‌ఘాట్ వద్ద వలస కార్మికులు బారికేడ్లను తొలగించుకొని ముందుకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో వస్తున్న కార్మికులను సరిహద్దుల వద్ద నిలిపివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించడంతో.. ఎక్కడివారినక్కడే నిలిపివేశారు. సుమారు 130 మంది వలస జీవులు సరైన ఆహారం లేక, ఇతర అనారోగ్య సమస్యలతో మధ్యలోనే మృతి చెందడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా వీరంతా తమ కుటుంబాలతో మధుర హై వే పైకి వచ్చి, బారికేడ్లను తొలగించుకొని నగరం వైపు పరుగులు తీశారు. రద్దీ ఎక్కువుండటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ విధమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment