
సాక్షి, చెన్నై: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధిని ప్రధాని మోదీ పరామర్శించడం తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం పెద్దనోట్లను రద్దుచేసి ఏడాదైన సందర్భంగా మధురైలో నిర్వహించిన బ్లాక్ డే నిరసనల్లో స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. కరుణానిధిని ప్రధాని పరామర్శిస్తున్న సమాచారం తనకు ముందుగా తెలియదని స్పష్టంచేశారు. మోదీ చెన్నైలో కరుణను కలవనున్నారని తనకు దుబాయ్‌లో ఉన్నపుడు తెలిసిందని, అక్కడి పర్యటన రద్దు చేసుకుని వచ్చానని స్టాలిన్ తెలిపారు. కరుణానిధిని సార్ అని మోదీ పిలిచారనీ, ఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవాలని, అక్కడి తన నివాసానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని మోదీ సూచించారన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని, డీఎంకే పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment